News April 4, 2025

ఫెయిల్ అయిన వారికి మరో ఛాన్స్

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో B.A, B,COM, B.B.A, BSC,BCA కోర్సుల1,3,5 సెమిస్టర్ పరీక్షలు మరోసారి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కొద్దినెలల క్రితం ఈ పరీక్షలు నిర్వహించగా ఉత్తీర్ణత శాతం తక్కువగా రావడంతో ఆయా సెమిస్టర్ల పరీక్షలు మరోసారి నిర్వహించాలనే వినతుల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల3వ వారం నుంచి నిర్వహించే డిగ్రీ కోర్సుల 2,4,6వ సెమిస్టర్ పరీక్షలతోపాటు నిర్వహించనున్నారు.

Similar News

News April 5, 2025

నేడు IPLలో డబుల్ ధమాకా

image

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై వేదికగా సీఎస్కే-డీసీ తలపడనున్నాయి. ఈ మ్యాచుకు రుతురాజ్ గైర్హాజరీలో సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ వ్యవహరించే ఛాన్స్ ఉంది. మరోవైపు రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ ఢీకొననున్నాయి. వరుస విజయాలతో పంజాబ్ జోరు మీద ఉండగా, వరుస ఓటములతో రాజస్థాన్ డీలా పడింది. మరి ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News April 5, 2025

నేడు మంథని నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సు

image

శ్రీ రామనవమి కళ్యాణోత్సం కోసం మంథని నుంచి భద్రాచలం వరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లు మంథని డీఎం శ్రావణ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి, ఆదివారం కళ్యాణోత్సవం తర్వాత సాయంత్రం 4 గంటలకు తిరిగి మంథనికి బయలు దేరుతుందని పేర్కొన్నారు. ఫుల్ టికెట్ రూ.450, హాఫ్ టికెట్ రూ.225, మహిళలకు ఉచిత పథకం ఉందని తెలిపారు.

News April 5, 2025

వక్ఫ్ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం: పవన్

image

AP: వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం చరిత్రాత్మకమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ బిల్లుతో దేశంలోని పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో దీర్ఘకాల సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతోంది. ప్రతిపక్షాల అభిప్రాయాలను గౌరవిస్తూనే సభలో చర్చ జరిపిన తీరు అందరికీ ఆదర్శం. ఈ బిల్లు ఆమోదంతో ముస్లింల హక్కులకు భద్రత లభించినట్లే’ అని ఆయన వ్యాఖ్యానించారు.

error: Content is protected !!