News April 4, 2025
రాజమండ్రి: ఫార్మాసిస్టు నాగాంజలి మృతి

మృత్యువుతో 12 రోజుల పాటు పోరాడిన ఫార్మాసిస్టు నాగాంజలి (23) శుక్రవారం మృతి చెందింది. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి AGM దీపక్ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నాగాంజలి గత నెల 23వ తేదీ నుంచి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News November 7, 2025
నేడు సామూహిక ‘వందేమాతరం’ గీతాలాపన

వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు సామూహిక గీతాలాపన చేయాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్ సముదాయంలో ఉదయం 10 గంటలకు సామూహిక వందేమాతరం గీతాలాపన జరుగుతుందని ఆయన ప్రకటించారు.
News November 7, 2025
ORRకు NTR జిల్లాలో భూసేకరణ పూర్తి.. ఆ మండలాల మీదుగానే.!

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి NTR జిల్లాలో భూసేకరణ పూర్తి చేశారు. మైలవరం, G.కొండూరు, వీరులపాడు, కంచికచర్ల మండలాల పరిధిలో 18 గ్రామాల మీదుగా సుమారు 51 K.M పరిధిలో ORR నిర్మాణం కానుంది. జిల్లాలో 3,300 ఎకరాల భూమిని సేకరించి వాటి వివరాలు NH అధికారులకు అధికారులు పంపారు. త్వరలో సేకరించనున్న భూముల వివరాలు, కంపెన్సేషన్ తెలుపుతూ గెజిట్ విడుదల చేయనున్నారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
News November 7, 2025
NZB జిల్లాలో రేపటి నుంచి 163 సెక్షన్

TGPSC నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద రేపటి నుంచి 14వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163ను అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రం వద్ద తిరగవద్దని ఆయన సూచించారు.


