News April 4, 2025
శంకరపట్నం: పోలీస్ విధులను ఆటంకపరిచిన వ్యక్తిపై కేసు నమోదు

కేశవపట్నం పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కొత్తపల్లి రవి పేర్కొన్నారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ఎలుకపెళ్లి కళ్యాణ్‌కు ఓ కేసు విషయమై కోర్ట్ సమన్లు ఇవ్వడానికి హోంగార్డ్ సదానందం అతని ఇంటికివెళ్ళగా.. తీసుకోవడానికి నిరాకరించాడు. అనంతరం సాయంత్రం పోలీస్ స్టేషన్ కి వచ్చి పురుగు మందు తాగి చనిపోతానని బెదిరించడంతో కళ్యాణ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు.
Similar News
News April 5, 2025
గ్రూప్-1లో మెరిసిన గంగాధర ఎస్ఐ

కరీంనగర్ జిల్లా గంగాధర మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న వంశీ కృష్ణ టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో 390వ ర్యాంక్ సాధించాడు. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్-1 పరీక్ష రాయగా మెరుగైన ర్యాంక్ సాధించాడు. దీంతో ఆయనకు మండల ప్రజలు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.
News April 5, 2025
కరీంనగర్ స్మార్ట్ సిటీ పెండింగ్ పనులపై సమీక్ష

కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, ఆర్వీ కన్సల్టెన్సీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ సిటీ లిమిటెడ్‌లో అభివృద్ధి పనులపై చర్చించి వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.
News April 5, 2025
రోగుల సేవలో నర్సుల పాత్ర కీలకం: కరీంనగర్ కలెక్టర్

ఆస్పత్రుల్లో రోగులకు సేవ చేయడంలో నర్సుల పాత్ర కీలకమైందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి అన్నారు. కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చదవబోతున్న మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రతిజ్ఞ కార్యక్రమం గణేశ్ నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. రోగి కోలుకోవడంలో నర్సుల పాత్ర ముఖ్యమైందని, మానవతా దృక్పథంతో వారు సేవలందించాలని సూచించారు.