News April 4, 2025
నంద్యాలలో ఈనెల 10న జాబ్ మేళా

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 14 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, B.Tech (Mechanical), B/D/M.Pharmacy, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు.
Similar News
News April 8, 2025
ఆ రూల్ మార్చాలి.. భారత క్రికెటర్ అసహనం

MI, RCB మ్యాచ్‌పై IND క్రికెటర్ విహారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘RCB ఇన్నింగ్స్ లాస్ట్ బాల్‌కు జితేశ్‌శర్మను అంపైర్ LBWగా ప్రకటించారు. రివ్యూ తీసుకోగా నాటౌట్ అని తేలింది. ఆ బంతికి పరుగు తీసినా రూల్ కారణంగా కౌంట్ అవ్వలేదు. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో లాస్ట్ బాల్‌కు 2 రన్స్ చేయాల్సిన సమయంలో ఇలా జరిగితే పరిస్థితేంటి? అంపైర్ నిర్ణయంతో ఫలితం మారేది. ఇప్పటికైనా ఈ రూల్ మార్చాలి’ అని అసహనం వ్యక్తం చేశారు.
News April 8, 2025
MGUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 39 మంజూరు పోస్టులకు గాను 29 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 10 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు.
News April 8, 2025
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మండల ఇన్‌ఛార్జిలు వీరే!

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మండల ఇన్‌ఛార్జిలను డీసీసీ అధ్యక్షుడు అశోక్ నియమించారు. ములుగు మండలం రవి, సత్తిరెడ్డి, బిక్షపతి, వెంకటాపూర్ రవిచందర్, భగవాన్ రెడ్డి, గోవిందరావుపేట కళ్యాణి, తాడ్వాయి సోమయ్య, మల్లంపల్లి రాజేందర్, ఏటూరునాగారం సురేంద్రబాబు, కన్నాయిగూడెం దేవేందర్, మంగపేట మండలం వెంకన్న, గంగారం మొగిలి, కొత్తగూడ రూప్ సింగ్, వెంకటాపురం రమేష్ బాబు, వాజేడు విక్రాంత్‌ను ఎంపిక చేశారు.