News April 4, 2025
చరిత్ర సృష్టించిన కోల్‌కతా నైట్‌రైడర్స్

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చరిత్ర సృష్టించింది. మూడు వేర్వేరు జట్లపై 20కిపైగా విజయాలు సాధించిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఆ జట్టు PBKS-21, RCB-20, SRHపై 20 విజయాలు సాధించింది. నిన్న SRHతో జరిగిన మ్యాచులో ఆ జట్టు ఈ ఘనత సాధించింది. కాగా సన్‌రైజర్స్‌పై కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
Similar News
News April 5, 2025
పవర్ ప్లేలో అత్యధిక బంతులు ఎదుర్కొన్నది ఇతడే..

IPLలో LSG స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ చరిత్ర సృష్టించారు. పవర్ ప్లేలో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా మార్ష్ నిలిచారు. MIతో మ్యాచులో ఆయన పవర్ ప్లేలో 30 బంతులు ఎదుర్కొని 60 పరుగులు చేశారు. ఈ క్రమంలో శిఖర్ ధవన్ (29 బంతుల్లో 42) రికార్డును ఆయన అధిగమించారు. ఆ తర్వాత గంగూలీ (28 బంతుల్లో 32) జయసూర్య (28 బంతుల్లో 59), లంబ్ (28 బంతుల్లో 50), సాల్ట్ (28 బంతుల్లో 60) వార్నర్ (28 బంతుల్లో 36) ఉన్నారు.
News April 5, 2025
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 15 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,327 మంది దర్శించుకోగా, 26,354 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
News April 5, 2025
నేడు భద్రాచలానికి పవన్ కళ్యాణ్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు భద్రాచలానికి వెళ్లనున్నారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణంలో పాల్గొంటారు. ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ మాదాపూర్‌లోని తన నివాసానికి చేరుకుంటారు. పవన్ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.