News April 4, 2025
సికింద్రాబాద్: రైలులో బాలికకు లైంగిక వేధింపులు

సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. రక్సెల్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ బాలిక అర్ధరాత్రి 2 గంటలకు వాష్ రూమ్‌కు వెళ్లింది. ఇది గమనించిన ఓ యువకుడు ఆమెను అనుసరించాడు. బాత్రూం వద్ద అరగంట సేపు ఆపి వీడియోలు తీసి, లైంగికంగా వేధించాడు. బాధితురాలు ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు రైల్వే టోల్‌ఫ్రీ నంబరు 139కి ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News April 5, 2025
అనకాపల్లి జిల్లాలో పిడుగులు కూడిన వర్షాలు

నిన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర ఏపీ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశాపై సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో విస్తరించి ఉండటంతో బలహీనపడి ఉందని ఈ ప్రభావంతో జిల్లాలో శనివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
News April 5, 2025
సెల్యూట్ సిద్ధార్థ్: చివరి క్షణాల్లోనూ దేశం కోసమే..

జామ్‌నగర్‌లో కూలిపోయిన జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ (28) దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. విమానం బయల్దేరిన కాసేపటికే సాంకేతిక వైఫల్యం తలెత్తింది. వెంటనే కో పైలట్‌ను సేఫ్‌గా బయటపడేలా చేశాడు. సిద్ధార్థ్ తప్పించుకునే ఛాన్స్ ఉన్నా విమానాన్ని జనావాసాలకు దూరంగా పడేలా చేసి ఎన్నో ప్రాణాలను కాపాడారు. ఈ క్రమంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. చావులోనూ తన ప్రాణం కోసం కాకుండా దేశం కోసమే పనిచేశాడు.
News April 5, 2025
విజయనగరం డిపోలో ఆర్టీసీ బస్సు చోరీ

విజయనగరం RTC డిపోలో ఉన్న హయ్యర్ బస్సును(AP35Y1229) ఈనెల 2న దొంగలు ఎత్తికెళ్లినట్లు బస్సు యజమాని సాగి కృష్ణమూర్తిరాజు 1టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీపురుపల్లి-విజయనగరం మధ్య తిరిగే బస్సును ఈనెల 2న రాత్రి డిపో పార్క్ చేయగా.. మూడో తేది ఉదయం వచ్చేసరికి కనిపించలేదన్నారు. బస్సుకు తాళం ఉండటంతో ఎవరూ లేని సమయంలో దొంగలు ఎత్తికెళ్లినట్లు శుక్రవారం ఫిర్యాదు చేశారు. బస్సు డ్రైవర్‌ను విచారించినట్లు సమాచారం.