News April 4, 2025

బొల్లారం: ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి

image

బొల్లారం మున్సిపాలిటీలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయస్సు 45-50 ఉంటుందని తెలిపారు. గురువారం మధ్యాహ్నం వర్షం పడుతున్న సమయంలో పిట్స్ వచ్చి జ్యోతి థియేటర్ వద్ద పడిపోగా స్థానికులు అక్కడి నుంచి పంపించారు. తిరిగి మల్లన్న బస్తిలో పడిపోయి మృతి చెంది ఉండటంతో స్థానికులు పోలీసులకు తెలిపడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 15, 2026

కనుమ రోజున ప్రయాణాలు చేయవద్దా? దీని వెనుక ఉద్దేశం?

image

కనుమ రోజున ప్రయాణాలు చేయొద్దనే మాట ఎన్నో ఏళ్లుగా వినిపిస్తోంది. ఈ రోజును పశువుల పండుగగా జరుపుతారు. పంటల సాగులో సాయపడిన పశువులను పూజిస్తారు. అయితే పూర్వం ఎడ్ల బండ్లపై ప్రయాణాలు చేసే వారు కాబట్టి ఈ ఒక్కరోజైనా ఎద్దులను కష్టపెట్టొద్దనే ఉద్దేశంతో ప్రయాణాలు వద్దని చెప్పేవారని పండితులు గుర్తుచేస్తున్నారు. కాగా ప్రస్తుత కాలంలో ఈ నియమం వల్ల కుటుంబమంతా కలిసి గడిపేందుకు ఎక్కువ సమయం ఉంటుందంటున్నారు.

News January 15, 2026

సూర్యపై కామెంట్స్.. నటిపై రూ.100 కోట్ల దావా

image

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ తరచూ మెసేజ్ చేస్తున్నాడన్న నటి <<18721618>>ఖుషీ<<>> ముఖర్జీపై SKY అభిమాని అన్సారీ చర్యలకు దిగారు. నటి వ్యాఖ్యలను ఖండిస్తూ రూ.100 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేశారు. నటికి సూర్య కుమార్ మెసేజులు చేశారనడం పూర్తిగా తప్పని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయన్నారు. ఖుషీకి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.

News January 15, 2026

BREAKING: సంగారెడ్డి: అడవిలో విషపు కాయలు తిని చిన్నారులకు అస్వస్థత

image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రామచంద్రాపురం పరిధి బండ్లగూడలో బిహార్‌కు చెందిన 8 ఏళ్లలోపు ముగ్గురు చిన్నారులు స్థానిక అడవిలోకి వెళ్లారు. అక్కడ చెట్లకు ఉన్న విషపు కాయలు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు గమనించగా అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.