News April 4, 2025
అంబాజీపేట: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త సూసైడ్

అంబాజీపేట లీజర్ కాలనీకి చెందిన రొక్కాల మోజెస్ (34) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ చిరంజీవి గురువారం తెలిపారు. భార్యభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్ధలే సూసైడ్‌కు కారణమని ఎస్సై పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలతో వారం రోజుల క్రితం భార్య అల్లవరం మండలం తుమ్మలపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది. దీంతో జీవితంపై విరక్తి చెంది సూసైడ్ చేసుకున్నాడు.
Similar News
News April 5, 2025
నేడు భద్రాచలానికి పవన్ కళ్యాణ్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు భద్రాచలానికి వెళ్లనున్నారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణంలో పాల్గొంటారు. ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ మాదాపూర్‌లోని తన నివాసానికి చేరుకుంటారు. పవన్ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News April 5, 2025
NZB: సామిల్‌లో భారీ అగ్నిప్రమాదం

నిజామాబాద్ నగరంలోని పులాంగ్ ప్రాంతంలో ఉన్న ఓ సామిల్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. దీనితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. పోలీసులు కూడా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎంత మేర నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది.
News April 5, 2025
NGKL: చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఈనెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. స్థానికుల వివరాలు.. లింగాల మం. కొత్తకుంటపల్లికి చెందిన మధు(22) తమ్ముడు సాయితో కలిసి పనిమీద బైక్‌పై బయటికి వెళ్లారు. బైక్ అదుపుతప్పి చెట్టుని ఢీకొనగా ఇద్దరికీ గాయాలయ్యాయి. మధు చికిత్స పొందుతూ మరిణించారు. శుక్రవారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.