News April 4, 2025
HYDలో 20 వేల మంది పోలీసులతో బందోబస్తు: CP

శ్రీరామనవమి శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. తాజాగా సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ టేక్డీ వరకు కొనసాగే శోభాయాత్రకు ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP స్పష్టం చేశారు.
Similar News
News July 5, 2025
బారాషహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగ సందడి

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ సందడి ముందుగానే ప్రారంభమైంది. శుక్రవారం స్వర్ణాల చెరువు వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. జులై 6 నుంచి 10 తేదీ వరకు ఐదు రోజులపాటు రొట్టెల పండుగ జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకున్నారు.
News July 5, 2025
విశాఖలో ఏడో తరగతి బాలికపై అత్యాచారయత్నం

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.
News July 5, 2025
విజయనగరం జిల్లాలో నేడు జాతీయ లోక్ అదాలత్

విజయనగరం జిల్లా కోర్టులో శనివారం జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జిల్లా జడ్జ్ బబిత సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, చెక్కు బౌన్స్ కేసులు ఇరు వర్గాల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేసుకోవచ్చన్నారు.