News April 4, 2025
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో KCR సమావేశం..!

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌లో శనివారం ఉ. 10 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు, జనసమీకరణ విషయమై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలు హజరుకానునన్నట్లు సమాచారం.
Similar News
News November 8, 2025
ఏపీలో 10, 11 తేదీల్లో కేంద్ర బృందాల పర్యటన

AP: మొంథా <<18145441>>తుఫాను<<>> ప్రభావిత జిల్లాల్లో నష్టం అంచనా వేయడానికి 2 కేంద్ర బృందాలు ఈనెల 10, 11 తేదీల్లో పర్యటించనున్నాయి. హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమీ బసు నేతృత్వంలో మొత్తం 8మంది అధికారులు రాష్ట్రానికి రానున్నారు. వీరు 2 టీమ్‌లుగా విడిపోయి ప్రకాశం, బాపట్ల, ఏలూరు, కృష్ణా, తూ.గో, కోనసీమ జిల్లాల్లో రెండు రోజులు పర్యటిస్తారు. క్షేత్రస్థాయిలో పంట ఇతర నష్టాలను పరిశీలిస్తారు.
News November 8, 2025
కొత్తపల్లి: తండ్రికి తలకొరివి పెట్టిన ముగ్గురు కూతుళ్లు

కొత్తపల్లి గ్రామానికి చెందిన చెప్పులు కుట్టే వృత్తిదారుడు పులి దేవయ్య(65) అనారోగ్యంతో మృతి చెందారు. కుమారులు లేనప్పటికీ, దేవయ్యకు ముగ్గురు కూతుళ్లు సాంప్రదాయాన్ని పక్కనపెట్టి తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు చేశారు. పేదరికంలో ఉన్నప్పటికీ కూతుళ్లకు విద్యనందించి వివాహాలు చేసిన ఆయన ఆదర్శంగా నిలిచారు. దేవయ్య మరణం స్థానికులను విషాదంలో ముంచింది.
News November 8, 2025
2 నెలల్లో 2,717 మందిపై కేసు: SP

సెప్టెంబర్, అక్టోబరులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 2,182 మందిపై కేసులు నమోదు చేసినట్లు బాపట్ల SP ఉమామహేశ్వర్ శనివారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 535 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం 2,717 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు. 4 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 224 ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని 55 వాహనాలకు రూ.1,57,405ల నగదు జరిమానా విధించామన్నారు.


