News March 26, 2024
MBNR: తీవ్ర ఎండలు.. అధికారుల సూచనలు

✓ ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
✓ అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
✓ శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు.
✓ బయటకు వెళ్తే తెలుపు రంగు దుస్తులను ధరించండి.
Similar News
News March 26, 2026
బాలానగర్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాల్లో 5 రోజులుగా విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. పగలంతా అధిక ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. సాయంత్రం ఏదో ఒకచోట ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గడిచిన 24 గంటల్లో బాలానగర్ మండల కేంద్రంలో 23.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాజాపూర్ 3.0, మిడ్జిల్ మండలం దోనూరు 0.25 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది.
News March 26, 2026
MBNR: ‘173 సిలిండర్లు స్వాధీనం..121 కేసులు నమోదు’

గృహ అవసరాలకు ఇచ్చే సబ్సిడీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టవిరుద్ధమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ హెచ్చరించారు. గత 15రోజులుగా జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు చేశామన్నారు. ఈ తనిఖీల్లో వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న మొత్తం 173 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 121 కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.
News March 26, 2026
MBNR: కొత్త అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు..!

కేంద్ర ప్రభుత్వం కొత్త అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల విభజనకు ఏర్పాటు చేస్తున్నడంతో బాలానగర్ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజాపూర్, నవాబుపేట, బాలానగర్ మండలాలతో కొత్త నియోజకవర్గ ఆవిర్భావించనున్నట్లు పలువురు విద్యావేత్తలు అంటున్నారు. జనాభా పెరుగుదల, భౌగోళిక సమతుల్యత, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు.


