News April 4, 2025

GNT: బాలిక మృతి కేసు.. స్పెషల్ వైద్య బృందం దర్యాప్తు

image

నరసరావుపేటలో బాలిక మృతి కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక వైద్య బృందం గురువారం మంగళగిరి ఎయిమ్స్‌లో సమావేశమైంది. ఈ బృందంలో ఢిల్లీ, ముంబయి నుంచి వచ్చిన నిపుణులు ఉన్నారు. వారు మృత బాలిక రక్త నమూనాలపై సమగ్ర సమాచారం సేకరించారు. అనంతరం దర్యాప్తు కొనసాగించేందుకు గుంటూరు వైద్య కళాశాలకు బయలుదేరి వెళ్లారు. ఈ బృందంలో వెటర్నరీ డాక్టర్ సహా మొత్తం ఐదుగురు డాక్టర్లు ఉన్నారు.

Similar News

News April 5, 2025

తెనాలి రైలు ప్రయాణంలో యువకుడి మృతి

image

కోయంబత్తూరు నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్‌లో యువకుడి మృతి చెందాడు. శుక్రవారం బాపట్ల దగ్గర ఆయన కదలకపోవడంతో అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు టీసీకి తెలియజేశారు. సమాచారం మేరకు రైలు తెనాలిలో ఆపి అతన్ని కిందకు దించి వైద్య సాయాన్ని అందించగా అప్పటికే మృతిచెందినట్టు తేలింది. 23-25 ఏళ్ల మధ్య వయసున్న అతడి గుర్తింపు తెలియాల్సి ఉంది. జీఆర్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

News April 5, 2025

అమరావతిలో ప్రవాసాంధ్రుల కోసం ఎన్టీఆర్ ఐకాన్ 

image

మంగళగిరి ప్రాంతంలో ప్రవాసాంధ్రుల కోసం భారీ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఏపీఎన్ఆర్టీ సొసైటీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఎన్ఆర్ ఐకాన్’ ప్రాజెక్టుకు సంబంధించి ఫౌండేషన్ పనులకు టెండర్లు పిలిచారు. మొత్తం రూ.600కోట్ల వ్యయంతో 5 ఎకరాల్లో 36 అంతస్తుల రెండు టవర్‌లు మూడు దశల్లో నిర్మించనున్నారు. నివాస ఫ్లాట్‌లు, కార్యాలయ స్థలాలు ప్రవాసాంధ్రులకే అందుబాటులో ఉండనున్నాయి. 

News April 5, 2025

ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి: సీఎం

image

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సీఎం చంద్రబాబు కార్యాచరణ ఆదేశాలు జారీ చేశారు. వెలగపూడిలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 70 నియోజకవర్గాల్లో 100 పడకలపైగా ఆస్పత్రులు ఉన్నాయని, మిగిలిన 105 ప్రాంతాల్లో త్వరితంగా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. PPP పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి పరిశ్రమల తరహాలో సబ్సిడీలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

error: Content is protected !!