News April 4, 2025
అచ్యుతాపురంలో రోడ్డు ప్రమాదం.. ఫార్మా ఉద్యోగి మృతి

అచ్యుతాపురంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్వీఆర్ డ్రగ్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగి బగాది రమణారావు దుర్మరణం చెందాడు. బైక్‌పై విధులకు వెళుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పరిశ్రమ యాజమాన్యం తగిన పరిహారం అందజేసి కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్.రాము విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 18, 2025
మామునూర్ ఎయిర్‌పోర్టు.. నెక్స్ట్ ఏంటి?

మామునూర్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ఇందుకు 949 ఎకరాలు అవసరం కాగా 696 ఎకరాలు సేకరించారు. మరో 253 ఎకరాల కోసం 3 గ్రామాలను ఒప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడి భూముల ధరలు అమాంతం పెరగడంతో ఎకరాకు రూ.5కోట్లు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. ఎయిర్‌పోర్టు విషయం పట్టాలు తప్పినట్లవడంతో అధికారులు సమస్య క్లియర్ చేసి త్వరగా నిర్మించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. మీ కామెంట్
News April 18, 2025
మహబూబ్‌నగర్ జిల్లాలో 40 డిగ్రీలకు చెరువలో ఎండ

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10గంటలు దాటిందంటే ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నటు పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 39.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 21.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
News April 18, 2025
తిర్యాణి: ‘శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్’

ASF జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం SP డీవీ శ్రీనివాస్ రావు ఆదేశానుసారం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు రెబ్బెన సీఐ బుద్ధస్వామి వెల్లడించారు. నాయకపుగూడలో ఎస్సై శ్రీకాంత్‌తో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. సరైన ధృవపత్రాలు లేని 12 వాహనాలను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. గుడుంబా, గంజాయి విక్రయాలు కార్యక్రమాలు చేయొద్దని గ్రామస్థులకు సూచించారు.