News April 4, 2025

పల్నాడు జిల్లాలో ఒకరి హత్య

image

మాచర్ల నియోజకవర్గ పరిధిలో హరిచంద్ర హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఆయన మృతదేహం పొలంలో ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా రెండు రోజుల క్రితం నాగార్జున సాగర్ హిల్ కాలనీలో హరిచంద్ర కిడ్నాప్‌కు గురయ్యారు. రెండు రోజుల తర్వాత ఆయన శవమై కనిపించారు. పోలీసులు తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. హత్యకు కుటుంబ కలహాలు కారణమా? రాజకీయా కోణమా? అనేది దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 18, 2025

స్టేషన్ల సుందరీకరణ కాదు.. రైళ్లను పెంచండి: నెటిజన్లు

image

అమృత్‌ భారత్ స్కీమ్ కింద కేంద్రం రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. TGలోని సికింద్రాబాద్, బేగంపేట, వరంగల్ తదితర రైల్వే స్టేషన్లను సుందరీకరిస్తున్నారు. అయితే, దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ట్రాక్స్‌ను పునరుద్ధరించడం, మరిన్ని రైళ్లను పెంచడానికి బదులుగా స్టేషన్ల కోసం ఖర్చు చేస్తున్నారని ట్వీట్స్ చేస్తున్నారు. సీట్ల లభ్యత, ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News April 18, 2025

చైనాతో మంచి డీల్ చేసుకుంటాం: ట్రంప్

image

వాణిజ్యంపై త్వరలోనే చైనాతో మంచి ఒప్పందం చేసుకుంటామని US అధ్యక్షుడు ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే యూరప్‌తోపాటు ఇతర దేశాలతో డీల్ చేసుకోవడంలో కొంత సమస్య ఉందన్నారు. ఇటాలియన్ ప్రధానమంత్రి వైట్ హౌస్ పర్యటన సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. కాగా అమెరికా-చైనా మధ్య ప్రస్తుతం ట్రేడ్ వార్ నడుస్తోంది. డ్రాగన్ వస్తువులపై US ఏకంగా 245శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.

News April 18, 2025

నితీశ్ ఈసారి అంతంతమాత్రమే..!

image

IPL: గత సీజన్లో రాణించి వెలుగులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈసారి తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఈ సీజన్‌లో 7 మ్యాచుల్లో 6 సార్లు బ్యాటింగ్ చేసిన నితీశ్ కేవలం 131 పరుగులే చేశారు. ఆ ఇన్నింగ్స్ ఇలా ఉన్నాయి.. 30(15), 32(28), 0(2), 19(15), 31(34), 19(21). ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. స్ట్రైక్ రేట్ కూడా ఆకట్టుకునేలా లేదని, ఆయన బ్యాటింగ్ మెరుగుపర్చుకోవాల్సి ఉందని నెటిజన్లు అంటున్నారు.

error: Content is protected !!