News April 4, 2025
రాయచోటి : వాహనంపై స్టంట్ చేసిన యువకులపై కేసు

రాయచోటిలో స్కూటీపై వేగంగా, నిర్లక్ష్యంగా స్టంట్‌లు చేసిన ఇద్దరి యువకులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా వారికి వాహనం ఇచ్చిన యజమానిపైనా కేసు నమోదైంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు ఎవరూ బైక్స్ ఇవ్వొద్దని, వారు అతి వేగంగా ప్రయాణించి ప్రమాదం జరిగితే అది ఆ తల్లిదండ్రులకి బాధను కలిగిస్తుందని సూచించారు.
Similar News
News April 18, 2025
సంగారెడ్డి: జిల్లాకు వచ్చిన యూనిఫామ్ క్లాత్

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం అందించే ఉచిత యూనిఫామ్ క్లాత్ ఈ సంవత్సరం కూడా జిల్లా కేంద్రానికి చేరుకుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి వివిధ మండలాలకు పంపించనున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు యూనిఫామ్‌ను కుట్టి పాఠశాలల ప్రారంభం నాటికి అందించాలని డీఈఓ పేర్కొన్నారు.
News April 18, 2025
NRML: రైల్వే స్టేషన్లో గొడవ.. బ్లేడ్‌తో మెడపై కోశాడు

నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన కుంచెపుబాబు నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో బుకింగ్ కౌంటర్ వద్ద పడుకొని ఉండగా ఓ వ్యక్తి బ్లేడుతో మెడపై కోశాడు. పై ఫోటోలో ఉన్న వ్యక్తి నిన్న బాధితుడి వద్దకు వచ్చి గొడవ పెట్టుకొని బ్లేడ్‌తో బాబు మెడపై కట్ చేశాడని రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించామన్నారు. ఫోటోలోని వ్యక్తి ఆచూకీ తెలిస్తే తమకు, పోలీసులకు సమాచారమివ్వాలన్నారు.
News April 18, 2025
HYDలో కాంగ్రెస్, BRS లేకుండా ఎన్నికలు!

ఎన్నికలు వస్తే అధికార, ప్రతిపక్షాల మధ్య హడావిడి అంతా ఇంతా కాదు. అదేంటోగాని మన HYDలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందుకేనేమో ఈసారి MLC ఎన్నికల్లో INC, BRS దూరంగా ఉంటున్నాయి. ఇక గెలుపు కష్టమని తెలిసినా BJP డేర్ చేసింది. అభ్యర్థిని బరిలో నిలిపి బలం కూడబెట్టే ప్రయత్నం చేస్తోంది. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న MIM గెలుపు ధీమాతో ఉంది. రాష్ట్ర రాజకీయాలను శాసించే INC, BRS ఈ ఎన్నికపై నోరు మెదపకపోవడం గమనార్హం.