News April 4, 2025

మద్యం కుంభకోణం.. కసిరెడ్డికి షాక్

image

AP: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో సాక్షిగా హాజరుకావాలని ఇటీవల సీఐడీ కసిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సీఐడీ నోటీసులకు చట్టబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.

Similar News

News September 12, 2025

విజయవాడ: 163కి చేరిన డయేరియా కేసులు

image

విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇప్పటి వరకు మొత్తం 163 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిశ శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ప్రస్తుతం 92 మంది చికిత్స పొందుతుండగా, 71 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. డయేరియా బాధితులకు ప్రభుత్వం సరైన సమయంలో సరైన చికిత్స అందిస్తుందని ఆయన వివరించారు.

News September 12, 2025

మేం చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించింది: బుగ్గన

image

AP:YCP ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తోందంటూ ఆనాడు TDP ఆరోపించిందని మాజీ మంత్రి బుగ్గన Way2News కాన్‌క్లేవ్‌లో చెప్పారు. వాటిని మించి ఇచ్చిన అభివృద్ధి హామీలను నెరవేర్చాలని, లేకపోతే తప్పు చేసినట్లు ప్రభుత్వం ఒప్పుకోవాలని కోరారు. YCP హయాంలో చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించిందన్నారు. తమ ప్రభుత్వంలో GST వసూళ్లు పెరిగితే, కూటమి ప్రభుత్వ హయాంలో ఎందుకు పెరగడంలేదని ప్రశ్నించారు.

News September 12, 2025

గత ప్రభుత్వ పాలన అమరావతి నుంచే నడిచింది: సజ్జల

image

AP: రాజధానిలో ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ చాలు అని.. కొత్త కట్టడాలేమీ అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని, గత ప్రభుత్వ పాలన అక్కడి నుంచే నడిచిందని వివరించారు. విశాఖ నుంచి పాలన చేద్దామని జగన్ అనుకున్నారని, అయితే ఎన్నికలు రావడంతో అది కుదరలేదని చెప్పారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖతో పాటు అమరావతి కూడా అభివృద్ధి అయ్యేదని చెప్పారు.