News April 4, 2025

ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

image

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపన్యాసంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి దశ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు, రెండో దశ సమావేశాలు మార్చి 10 నుంచి ఇవాళ్టి వరకు జరిగాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో పాటు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.

Similar News

News April 18, 2025

గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలి: కవిత

image

TG: గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని అన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి పడిపోయాయని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయన్నారు.

News April 18, 2025

విడాకుల బాటలో మరో సెలబ్రిటీ జంట?

image

హీరోయిన్ నజ్రియా నజీమ్, ఫహాద్ ఫాజిల్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. SMలో నజ్రియా పెట్టిన ఓ పోస్ట్ దీనికి బలం చేకూరుస్తోంది. ‘నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. ‘సూక్ష్మదర్శిని’ విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోయా. ఇది చాలా కఠినమైన సమయం. పూర్తిగా కోలుకుని మళ్లీ మీ ముందుకొస్తా’ అంటూ రాసుకొచ్చారు. ఫహాద్‌తో విడాకుల వ్యవహారంతోనే ఆమె డిప్రెషన్‌లో వెళ్లారేమోనని నెటిజన్లు భావిస్తున్నారు.

News April 18, 2025

మస్క్‌తో చర్చలు.. మోదీ ట్వీట్

image

ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో చర్చలు జరిపినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని ప్రధాని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరువురి మధ్య జరిగిన విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ రంగాలలో భారత్, అమెరికా భాగస్వామ్యం మరింత పురోగమిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

error: Content is protected !!