News April 4, 2025

నంద్యాలలో ఈనెల 10న జాబ్ మేళా

image

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 14 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, B.Tech (Mechanical), B/D/M.Pharmacy, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు.

Similar News

News January 23, 2026

నంద్యాల కలెక్టరేట్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ

image

భారత ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో వివిధ శాఖల సిబ్బందితో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఎన్నికలోనూ కులమతాలకు, ప్రలోభాలకు తీతగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగిస్తామని ఈ సందర్భంగా సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

News January 23, 2026

లిక్కర్ స్కామ్.. ముగిసిన మిథున్‌రెడ్డి విచారణ

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. 7 గంటలపాటు హైదరాబాద్ ఈడీ ఆఫీసులో అధికారులు ఆయనను విచారించారు. మిథున్‌రెడ్డి వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. అనంతరం ఆయన ఇంటికి వెళ్లిపోయారు. నిన్న విజయసాయిరెడ్డిని ఇదే కేసులో అధికారులు 7 గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే.

News January 23, 2026

తడి, పొడి చెత్త సేకరణ పక్కాగా జరగాలి: కలెక్టర్

image

ఎన్‌జీటీ ఆదేశాలతో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం ఏలూరులో అధికారులతో సమీక్షించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా స్వీకరించి, భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.