News April 4, 2025
జనగామ: ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్

జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News April 18, 2025
పార్వతీపురం: ‘స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రాను విజయవంతం చేయాలి’

శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం జరగాలన్నారు. ‘ఇ వేస్ట్ మేనేజ్మెంట్’ శీర్షికన ఈ నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.
News April 18, 2025
మల్లన్న సేవలో సంగీత దర్శకుడు మణిశర్మ

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను సినీ సంగీత దర్శకుడు మణిశర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో ఆయనతో పలువురు ఫొటోలు దిగారు. సమరసింహారెడ్డి, అన్నయ్య, ఖుషి, ఆది, ఇంద్ర, అతడు, నారప్ప, ఆచార్య వంటి ఎన్నో చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించారు.
News April 18, 2025
జేఈఈ మెయిన్ ‘కీ’ విడుదల

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫైనల్ ‘కీ’ని ఎట్టకేలకు NTA విడుదల చేసింది. <