News April 4, 2025

అంబాజీపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

అంబాజీపేట మండలం గంగలకుర్రు ప్రాథమిక పాఠశాల వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఒకరు మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 18, 2025

పార్వతీపురం: ‘స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రాను విజయవంతం చేయాలి’

image

శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం జరగాలన్నారు. ‘ఇ వేస్ట్ మేనేజ్మెంట్’ శీర్షికన ఈ నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

News April 18, 2025

మల్లన్న సేవలో సంగీత దర్శకుడు మణిశర్మ

image

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను సినీ సంగీత దర్శకుడు మణిశర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో ఆయనతో పలువురు ఫొటోలు దిగారు. సమరసింహారెడ్డి, అన్నయ్య, ఖుషి, ఆది, ఇంద్ర, అతడు, నారప్ప, ఆచార్య వంటి ఎన్నో చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించారు.

News April 18, 2025

జేఈఈ మెయిన్ ‘కీ’ విడుదల

image

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫైనల్ ‘కీ’ని ఎట్టకేలకు NTA విడుదల చేసింది. <>https://jeemain.nta.nic.in/<<>> వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కాగా రేపు ఫలితాలు వెల్లడి కానున్నాయి. నిన్న రాత్రి ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో ఉంచి వెంటనే డిలీట్ చేసిన విషయం తెలిసిందే. కీలో తప్పులు దొర్లడంతో తొలగించినట్లు సమాచారం.

error: Content is protected !!