News April 4, 2025

సచివాలయంలో అగ్నిప్రమాదం.. సీఎం ఆగ్రహం

image

AP: సచివాలయంలో <<15986572>>అగ్నిప్రమాదం<<>> జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. సెక్రటేరియట్‌లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అని అధికారులను నిలదీశారు. ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. వెంటనే అన్ని చోట్లా సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయ ప్రాంగణంలో చెత్త పేరుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో చెత్తను క్లియర్ చేయాలని ఆదేశించారు.

Similar News

News April 18, 2025

జేఈఈ మెయిన్ ‘కీ’ విడుదల

image

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫైనల్ ‘కీ’ని ఎట్టకేలకు NTA విడుదల చేసింది. <>https://jeemain.nta.nic.in/<<>> వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కాగా రేపు ఫలితాలు వెల్లడి కానున్నాయి. నిన్న రాత్రి ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో ఉంచి వెంటనే డిలీట్ చేసిన విషయం తెలిసిందే. కీలో తప్పులు దొర్లడంతో తొలగించినట్లు సమాచారం.

News April 18, 2025

MMTSలో అత్యాచారయత్నం కేసు.. బిగ్ ట్విస్ట్

image

కొద్దిరోజుల క్రితం HYD MMTSలో అత్యాచారయత్నం సందర్భంగా యువతి రైలు నుంచి కిందకి <<15866506>>దూకేసిన<<>> ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని విచారణలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్‌స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయం చెబితే అంతా తిడతారని భయపడి ఓ యువకుడు అత్యాచారం చేయబోగా కిందకి దూకేసినట్లు చెప్పింది. తాజాగా ఆమె నిజం ఒప్పుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు.

News April 18, 2025

ఢిల్లీ నుంచి ఏ శక్తీ తమిళనాడును పాలించలేదు: స్టాలిన్

image

కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు, పార్టీలను విచ్ఛిన్నం చేసే BJP వ్యూహాలు తమిళనాడులో పనిచేయవని CM స్టాలిన్ స్పష్టం చేశారు. ఆ పార్టీ కలిగించే అడ్డంకులను చట్టప్రకారం ఎదుర్కొంటామని చెప్పారు. ‘2026లోనూ తమిళనాడులో ద్రవిడ ప్రభుత్వమే వస్తుంది. ఢిల్లీ నుంచి ఏ శక్తీ మా రాష్ట్రాన్ని పాలించలేదు. వారికి తలవంచడానికి మేం బానిసలం కాదు. నేను బతికున్నంత వరకు ఇక్కడ ఢిల్లీ ప్రణాళికలు పనిచేయవు’ అని తేల్చిచెప్పారు.

error: Content is protected !!