News April 4, 2025
మహిళలపై అఘాయిత్యాలు.. CM ఏంచేస్తున్నారు: RSP

శాంతి భద్రతలు కాపాడడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మేడ్చల్ MMTS రైలులో యువతిపై అత్యాచారయత్నం, సంగారెడ్డి కందిలో భర్తను కట్టేసి మహిళపై అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. స్వయంగా సీఎం హోంమంత్రిగా ఉన్నప్పటికీ ఇన్ని అఘాయిత్యాలు జరగటం ఏంటని ప్రశ్నించారు.
Similar News
News April 18, 2025
20,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు: ఇన్ఫోసిస్

ముందస్తు సమాచారం లేకుండా <<15595609>>400 మంది ట్రైనీలను తొలగించి<<>> విమర్శలపాలైన ఇన్ఫోసిన్ ఇప్పుడు యువతకు శుభవార్త చెప్పింది. FY2025-26లో 20K మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేశ్ వెల్లడించారు. జీతాల పెంపుపై మాట్లాడుతూ ‘కంపెనీలో జీతాల పెంపు సగటున 5-8% ఉంది. ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి 10-12% పెంచాం. JANలోనే చాలామందికి శాలరీలు పెరిగాయి. మిగతా వారికి APR 1 నుంచి అమల్లోకి వస్తాయి’ అని తెలిపారు.
News April 18, 2025
అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యం: బాపట్ల ఎస్పీ

అక్రమ రవాణా, నేర నియంత్రణ లక్ష్యంగా గురువారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ప్రతి పీఎస్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలను ఎంచుకొని 3,799 వాహనాలను సిబ్బంది తనిఖీ చేశారని చెప్పారు. వీటిలో సరైన ధ్రువపత్రాలు లేని 136 అనుమానిత వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. 268 వాహనాలకు చలానాలు విధించారన్నారు. అలాగే14 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
News April 18, 2025
అకాల వర్షం.. దుబ్బాక మార్కెట్‌లో తడిసిన ధాన్యం

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, తోగుట, మిరుదొడ్డి, సిద్దిపేట, నంగనూరు మండలాల్లో వర్షం కురిసింది. తోగుటలో రాళ్ల వాన పడింది. అకాల వర్షానికి రైతులు ఆరుగాలం పండించిన ధాన్యం తడిసిపోయింది. దుబ్బాక మార్కెట్ యార్డులో వడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ధాన్యంపై కప్పడానికి సరైన టార్పాలిన్ కవర్లు లేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి మార్కెట్ యార్డులో టార్పాలిన్ అందుబాటులో ఉంచి, ఆదుకోవాలని రైతులు కోరారు.