News April 4, 2025
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల బీఎస్పీ ముఖ్య నేతల సమావేశం

బహుజన సమాజ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు శుక్రవారం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇబ్రహీం శేఖర్ హాజరై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఆర్థికంగా సామాజికంగా ఎదిగి ఇతరులకు సహాయపడాలని, సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను రాజ్యాంగ బద్ధంగా ప్రశ్నించాలన్నారు.
Similar News
News January 1, 2026
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది 1.2 కోట్ల కొలువులు!

2026లో ఉద్యోగ నియామకాల జోరు మరింత పెరగనున్నట్లు టీమ్‌లీజ్ అంచనా వేసింది. ఈ ఏడాది సుమారు 1.2 కోట్ల కొత్త కొలువులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. టాటా మోటార్స్, EY, గోద్రేజ్ వంటి దిగ్గజ సంస్థలు క్యాంపస్ హైరింగ్‌తో పాటు టెక్నాలజీ, AI రంగాల్లో భారీగా రిక్రూట్‌మెంట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, విభిన్న ప్రతిభావంతులకు ప్రాధాన్యం ఇస్తూ వైవిధ్యతను పెంచడంపై కంపెనీలు ఫోకస్ పెట్టడం విశేషం.
News January 1, 2026
మహబూబ్‌నగర్ ఎస్పీకి ప్రమోషన్

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డి.జానకికి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు పదోన్నతి లభించింది. ఈ పదోన్నతి నేటి నుంచి అమలులోకి వచ్చినట్లు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఈరోజు నుంచే జిల్లా ఎస్పీ సెలక్షన్ గ్రేడ్ హోదాలో విధులు నిర్వహిస్తారు.
News January 1, 2026
పెద్దపల్లి: పంచాయతీరాజ్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం పెద్దపల్లి జిల్లా శాఖ ఉద్యోగుల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రంగు రవి, గౌరవ అధ్యక్షులు ఎం.రమేష్, ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డితో పాటు పూర్ణచంద్ర రావు, కరుణాకర్, సాదిక్ పాషా, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సిబ్బంది హాజరయ్యారు.


