News April 4, 2025
విజయనగరంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్

విజయనగరంలోని వీటి అగ్రహారంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌ను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా రీఛార్జ్ చేసేందుకు ఈ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాహనదారులంతా రీఛార్జి స్టేషన్‌ను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు ఉన్నారు.
Similar News
News April 16, 2025
డెంకాడ: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

డెంకాడ (M) చొల్లంగిపేట జంక్షన్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రణస్థలం (M) NGRపురం గ్రామానికి చెందిన జగిలి రామప్పడు(54) మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామప్పడు తన భార్య మహాలక్ష్మితో కలిసి ద్విచక్రవాహనంపై గజపతినగరం(M) గంగచోల్లపెంట గ్రామానికి వెళ్తున్నారు. చొల్లంగిపేట జంక్షన్‌కి వచ్చేసరికి వాహనం అదుపుతప్పి పడిపోయారు. ప్రమాదంలో రామప్పడు అక్కడికక్కడే మృతి చెందారు.
News April 15, 2025
VZM: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు

విజయనగరం పట్టణంలోని స్థానిక ఫైర్ స్టేషన్ సమీపంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉల్లి వీధికి చెందిన బూర్లి వాసును అదుపులోకి తీసుకొని విచారించగా అతని సమాచారంతో బెట్టింగ్ నిర్వహిస్తున్న మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశామన్నారు.
News April 13, 2025
రేగిడి: చెట్టును ఢీకొన్న టిప్పర్.. డ్రైవర్ దుర్మరణం

ఇసుక లోడింగ్ కోసం వెళ్తున్న టిప్పర్ రేగిడి (M) రెడ్డి పేట సెంటర్ వద్ద ఆదివారం ఉదయం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ ముందుభాగం పూర్తిగా దెబ్బతినడంతో అనకాపల్లికి చెందిన డ్రైవర్ నాగరాజు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తనను కాపాడాలంటూ చేసిన ఆర్తనాదాలతో తోటి డ్రైవర్లు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నాగరాజును బయటికి తీసేందుకు ప్రయత్నించగా అప్పటికే చనిపోయాడు.