News April 4, 2025
అమెరికాతో చైనా టారిఫ్ వార్.. 34శాతం సుంకం విధింపు

అమెరికా టారిఫ్‌లపై చైనా అన్నంత పని చేసింది. US ఉత్పత్తులపై 34శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల అన్ని దేశాలపై టారిఫ్‌లు పెంచిన అమెరికా చైనా పైనా 34శాతం సుంకం విధించింది. దీనిపై ఘాటుగా స్పందించిన డ్రాగన్ దేశం టారిఫ్ తగ్గించకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది. కానీ అమెరికా దీనిపై వెనక్కి తగ్గకపోవడంతో ప్రతీకారంగా చైనా 34శాతం సుంకం విధించింది.
Similar News
News April 18, 2025
20,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు: ఇన్ఫోసిస్

ముందస్తు సమాచారం లేకుండా <<15595609>>400 మంది ట్రైనీలను తొలగించి<<>> విమర్శలపాలైన ఇన్ఫోసిన్ ఇప్పుడు యువతకు శుభవార్త చెప్పింది. FY2025-26లో 20K మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేశ్ వెల్లడించారు. జీతాల పెంపుపై మాట్లాడుతూ ‘కంపెనీలో జీతాల పెంపు సగటున 5-8% ఉంది. ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి 10-12% పెంచాం. JANలోనే చాలామందికి శాలరీలు పెరిగాయి. మిగతా వారికి APR 1 నుంచి అమల్లోకి వస్తాయి’ అని తెలిపారు.
News April 18, 2025
భార్యతో విడాకులు.. గర్ల్‌ఫ్రెండ్‌తో ధవన్(PHOTO)

ఆయేషా ముఖర్జీతో విడిపోయిన తర్వాత IND మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ విదేశీ యువతి సోఫీ షైన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా వీరిద్దరూ దిగిన ఫొటో వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్, తన ప్రియురాలు గౌరీ స్ప్రత్ హాజరైన ఈవెంట్‌లో ధవన్, సోఫీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా కలిసి ఫొటో దిగారు. కాగా ఈ ఐరిష్ భామతో ధవన్ ఏడాదిగా డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
News April 18, 2025
ఆ విధానం అమలుపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

టోల్‌గేట్లు ఎత్తేసి శాటిలైట్ ట్రాకింగ్ ఆధారంగా వాహన ఛార్జీ వసూలు చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మే 1నుంచే ఇది అమల్లోకి వస్తోందంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ANPR) విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంది. తొలుత ఎంపిక చేసిన టోల్‌ప్లాజాల వద్ద అమర్చుతామని పేర్కొంది.