News April 4, 2025
నిజామాబాద్‌లో ముస్లింల నిరసన

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై నిజామాబాద్ నగరంలోని నెహ్రూపార్క్ వద్ద ముస్లింలు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకొచ్చి ముస్లింల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏసీపీ(ACP) రాజా వెంకట్ రెడ్డి, 1వ టౌన్ (SHO) రఘుపతి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పారు.
Similar News
News February 7, 2026
NZB: ‘పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి’

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సమర్థవంతంగా బాధ్యతతో విధులు నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు.
News February 7, 2026
NZB: సండేతో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ గడువు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విధులలో నిమగ్నం అయి ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో నిమగ్నం అయి ఉన్న పోలీసు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు.
News February 7, 2026
NZB: అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి: CP

పోలీస్ శాఖలో ప్రతి సిబ్బంది పాత్ర అత్యంత ముఖ్యమని, వారు తమకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని CP సాయి చైతన్య సూచించారు. శనివారం ఆయన కోర్ట్ డ్యూటీ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల పరిష్కారం త్వరితగతిన ముగిసేలా సాక్ష్యులను ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్షపడేలా చూసి పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంచే విధంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు.


