News April 4, 2025
ASF జిల్లా మైనార్టీ సంక్షేమ ఇన్‌ఛార్జ్ అధికారిగా నదీమ్

ఆసిఫాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌ఛార్జ్ అధికారిగా అబ్దుల్ నదీమ్ ఖుద్దూసీ నియమితులయ్యారు. నదీమ్ జిల్లా హార్టికల్చర్ (ఉద్యానవన ) అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు
Similar News
News April 18, 2025
కమిన్స్ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడా?

SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భార్య బెకీ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫొటో చర్చనీయాంశమైంది. ఎయిర్‌పోర్టులో భర్తతో కలిసి ఫొటో దిగిన ఆమె ‘గుడ్‌బై ఇండియా’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో కమిన్స్ మిగతా మ్యాచులు ఆడకుండా IPL మధ్యలోనే ఆసీస్ వెళ్లిపోతున్నాడా? అని SRH ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే అతడు భార్యకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మాత్రమే ఎయిర్‌పోర్టు వెళ్లాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
News April 18, 2025
నెల్లూరు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి: యువరాజ్

అధికారులు సమన్వయంతో పనిచేసి నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ యువరాజ్ అధికారులకు సూచించారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌లో ఆయన కలెక్టర్ ఆనంద్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా మాత్రమే రెవెన్యూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అన్నారు.
News April 18, 2025
రేపు దేశవ్యాప్త నిరసనలకు VHP పిలుపు

హింసాత్మక ఘటనల నేపథ్యంలో బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని విశ్వహిందూ పరిషత్(VHP) డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు VHP ప్రెసిడెంట్ ఆలోక్ కుమార్ రేపు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో సంస్థ సభ్యులు, మద్దతుదారులు ధర్నాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ జిల్లాల మెజిస్ట్రేట్లకు మెమోరాండం సమర్పించాలని సూచించారు.