News April 4, 2025

NRPT: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

image

నారాయణపేట మండలం అప్పంపల్లి గ్రామంలో గత ఫిబ్రవరి 21న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారు దేవమ్మ అనే మహిళ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కాగా శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆ ఇంటి నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో సుదర్శన్, పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అలాగే గ్రామంలోని షమీ బేగం, ఆశా బేగం ఇళ్లను పరిశీలించారు.

Similar News

News April 18, 2025

NZB: భూ సమస్యలను గడువులోగా పరిష్కరిస్తాం: కలెక్టర్

image

భూ భారతి చట్టం ప్రకారం భూ సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరిస్తామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్‌కు లేదా సీసీఎల్ఏకు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదన్నారు.

News April 18, 2025

మే 15కల్లా టీడీపీ సంస్థాగత ఎన్నికలు పూర్తి: బత్తుల

image

అనకాపల్లి జిల్లాలో మే15 కల్లా TDP సంస్థాగత ఎన్నికలు పూర్తిచేయనున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు శుక్రవారం వడ్డాదిలో చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 22కల్లా కుటుంబసాధికార కమిటీలు పూర్తి చేయాలన్నారు. తదుపరి బూత్, క్లస్టర్, మండల, జిల్లా కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలను పూర్తి చేస్తామన్నారు.

News April 18, 2025

కాసేపట్లో మ్యాచ్.. స్టేడియం వద్ద వర్షం

image

క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. కాసేపట్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా RCB-PBKS మ్యాచ్ జరగాల్సి ఉండగా ప్రస్తుతం అక్కడ వర్షం మొదలైంది. దీంతో గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు. వాన త్వరగా తగ్గి మ్యాచ్ జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వర్షంతో ఇవాళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.

error: Content is protected !!