News April 4, 2025
PDPL: ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంథని మండలం దుబ్బపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 173లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి చేయాలని చూస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 18, 2025
పేరేచర్ల- కొండమోడు నేషనల్ హైవే పనులు వేగం

పేరేచర్ల- కొండమోడు నేషనల్ హైవే నిర్మాణం జోరందుకుంది. కేంద్రం భూసేకరణ పరిహారంగా రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.43 కోట్లు జమ చేసింది. మొత్తం రూ.88 కోట్లలో ఇదివరకు చెల్లింపులు మొదలయ్యాయి. వివాదాల్లేని భూములకు పరిహారం చెల్లింపుతో భూసేకరణ ప్రక్రియకు ఊపొచ్చింది. 49.9 కిలోమీటర్ల విస్తరణ పనులు రూ.881 కోట్లతో కాంట్రాక్టర్కు అప్పగించగా, భారత్మాల కింద గ్రీన్ సిగ్నల్ రావడంతో పనులు ప్రారంభ దశలోకి వచ్చాయి.
News April 18, 2025
NZB: భూ సమస్యలను గడువులోగా పరిష్కరిస్తాం: కలెక్టర్

భూ భారతి చట్టం ప్రకారం భూ సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరిస్తామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్కు లేదా సీసీఎల్ఏకు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదన్నారు.
News April 18, 2025
మే 15కల్లా టీడీపీ సంస్థాగత ఎన్నికలు పూర్తి: బత్తుల

అనకాపల్లి జిల్లాలో మే15 కల్లా TDP సంస్థాగత ఎన్నికలు పూర్తిచేయనున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు శుక్రవారం వడ్డాదిలో చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 22కల్లా కుటుంబసాధికార కమిటీలు పూర్తి చేయాలన్నారు. తదుపరి బూత్, క్లస్టర్, మండల, జిల్లా కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలను పూర్తి చేస్తామన్నారు.