News April 4, 2025

గచ్చిబౌలి భూముల్లోకి బయటి వ్యక్తుల నిషేధం

image

TG: కంచ గచ్చిబౌలి భూములపై పోలీసులు కీలక ఆదేశాలిచ్చారు. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులు ఆ భూముల్లోకి వెళ్లరాదని స్పష్టం చేశారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News April 18, 2025

UPI పేమెంట్స్‌పై GST.. క్లారిటీ

image

రూ.2వేలకు పైన చేసే UPI పేమెంట్స్‌పై కేంద్రం 18% GST విధించనున్నట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలపై కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. అవన్నీ నిరాధార, తప్పుదోవ పట్టించే వార్తలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమీ లేవని స్పష్టం చేసింది.

News April 18, 2025

మొక్కల ఆధారిత ప్రొటీన్లతో ఎక్కువ ఆయుర్దాయం

image

శరీరానికి విటమిన్లతో పాటు ప్రొటీన్లు చాలా అవసరం. వాటి కోసం మాంసాన్ని ఆశ్రయిస్తుంటాం. అయితే మొక్కల ఆధారిత(శనగలు, బఠానీలు, టోఫు) ప్రొటీన్లు తీసుకునే దేశాల్లో వయోజన ఆయుర్దాయం ఎక్కువని సిడ్నీ వర్సిటీ అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక వ్యాధులు, అకాల మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని వెల్లడైంది. 1961-2018 మధ్య 101 దేశాల్లో ఆహార సరఫరా, జనాభా డేటా ఆధారంగా సైంటిస్టులు ఈ అధ్యయనం చేశారు.

News April 18, 2025

త్వరలో EPFO 3.0.. సేవలు సులభతరం: మాండవీయ

image

ఈపీఎఫ్‌వో చందాదారులకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శుభవార్త చెప్పారు. సేవలను సులభతరం చేసేందుకు అత్యాధునిక ఫీచర్లతో మే/జూన్‌కు EPFO 3.0ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆటో క్లెయిమ్, డిజిటల్ కరెక్షన్స్, ATM ద్వారా నగదు విత్‌డ్రా వంటి సదుపాయాలు ఉంటాయని వెల్లడించారు. క్లెయిమ్‌లు, కరెక్షన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, ఫారాలు నింపడం వంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.

error: Content is protected !!