News April 4, 2025

NZB: సన్న బియ్యం పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి: మంత్రి

image

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సన్న బియ్యం పంపిణీపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు.

Similar News

News April 8, 2025

NZB: అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం: కవిత

image

అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. అనుముల ఇంటెలిజెన్స్ అని ఎద్దేవా చేశారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

News April 8, 2025

టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

image

తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 89 పోస్టులకు గానూ 48 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 41 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

News April 8, 2025

నిజామాబాద్‌లో రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన డిచ్‌పల్లి స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాలు.. సోమవారం రాత్రి డిచ్పల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 30-35 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేశారు. వివరాలు తెలిసిన వారు 8712658591 నంబరును సంప్రదించాలన్నారు.

error: Content is protected !!