News April 4, 2025
పెబ్బేర్: ప్రతిభ చాటిన ఆకాశ్‌కు కలెక్టర్ అభినందనలు

పెబ్బేర్ మండలం వైశాఖాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచారు. వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఈర్లదిన్నె ఆకాశ్ అనే విద్యార్థి గురుకుల ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ అతడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో భీమ్‌సాగర్, ప్రిన్సిపల్ రిజో బాబు, అస్మత్ పాల్గొన్నారు.
Similar News
News January 8, 2026
ధనుర్మాసం: ఇరవై నాలుగో రోజు కీర్తన

ఈ పాశురం కృష్ణుని గాథలు, గుణాన్ని కొనియాడుతోంది. రావణుని గెలిచిన రాముడికి, కృష్ణుడికి గోపికలు మంగళాశాసనాలు పలుకుతున్నారు. ‘గోవర్ధన గిరిని ఎత్తి గోకులాన్ని రక్షించిన నీ కరుణకు, శత్రువులను చెండాడు నీ సుదర్శన చక్రానికి జయం కలుగుగాక’ అని కీర్తిస్తున్నారు. ‘స్వామి! నీ వీరగాథలను స్తుతిస్తూ, మా నోముకు కావాల్సిన పరికరాలను ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు’ అని గోపికలు వేడుకుంటున్నారు. <<-se>>#DHANURMASAM<<>>
News January 8, 2026
కృత్రిమ ఊపిరితిత్తులు.. IITH పరిశోధనలు

ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఐఐటీ హైదరాబాద్ ఓ శుభవార్త అందించింది. కృత్రిమ ఊపిరితిత్తుల అభివృద్ధి దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపింది. జర్మనీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్‌తో కలిసి ఈ పరిశోధనలు చేయనుంది. అవయవ మార్పిడి అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యంగా IIT హైదరాబాద్ పని చేస్తోంది. విజయవంతమైతే త్వరలోనే ఆర్టిఫీషియల్ లంగ్స్ అందుబాటులోకి రానున్నాయి.
News January 8, 2026
ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య

ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లు దీనికి ప్రధాన కారణాలు. ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉండటం, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటే టెస్ట్ చేపించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం, సరైన ఆహారం తీసుకుంటే దీనికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు.


