News April 4, 2025

స్విమ్స్‌కు జాతీయ ప్రాముఖ్యత హోదా ఇవ్వండి: ఎంపీ

image

రాయలసీమ ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్న తిరుపతి స్విమ్స్‌కు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా పరిగణించాలని ఎంపీ గురుమూర్తి కోరారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేసే అవకాశం వస్తుందన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాల అభివృద్ధి, నూతన పరిశోధన ప్రయోగశాలలు, వైద్య పరికరాలకు నిధులు వస్తాయన్నారు.

Similar News

News January 16, 2026

ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్

image

AP: రాష్ట్రానికి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ‘AM గ్రీన్’ కంపెనీ కాకినాడలో 1.5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎక్స్‌పోర్ట్ టర్మినల్ ఏర్పాటు చేయబోతుందని, దీనివల్ల 8వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని ట్వీట్ చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన అమ్మోనియాను జపాన్, జర్మనీ, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారని పేర్కొన్నారు.

News January 16, 2026

భూపాలపల్లి: మైనారిటీ గురుకులంలో ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

image

భూపాలపల్లి మైనారిటీ గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల పోస్టర్‌ను కలెక్టర్ రాహుల్ శర్మ ఆవిష్కరించారు.5వ తరగతి,ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు 6,7,8వతరగతుల్లోని మిగులు సీట్ల కోసం FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఉత్తమ బోధనతోపాటు IIT/NEET శిక్షణ ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలొ ప్రిన్సిపల్ రవి తదితరులు పాల్గొన్నారు.

News January 16, 2026

ఇది HYD మెట్రో ప్రయాణికుల కోసం!

image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు విజ్ఞప్తి. L&T మెట్రో రైల్ కొత్తగా సర్వే చేస్తోంది. పై ఫొటోలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి ప్రయాణికులు తమ అభిప్రాయాలను పంచుకోవాలని పిలుపునిచ్చింది. దీని వలన ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యవంతంగా చేయడానికి సాయం చేస్తుందని పేర్కొంది. నిత్యం మెట్రోలో ప్రయాణించేవారికి ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.