News April 4, 2025
బాసరలో వరంగల్ విద్యార్థి మృతి

నిర్మల్ జిల్లా బాసర వేద భారతి విద్యాలయంలో కరెంట్ షాక్‌తో విద్యార్థి మృతిచెందాడు. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠగా గుర్తించారు. ఇక్కడ గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై విద్యార్థి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విద్యార్థి శుక్రవారం ఉదయం బోరు బటన్ వేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో మృతిచెందటం ఆందోళనకరం. ఘటనపై బాసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 5, 2025
వరంగల్ వాసులూ.. APPLY చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను వరంగల్ జిల్లాలోని MPDO ఆఫీసులలో ఇవ్వాలి. SHARE
News April 5, 2025
వరంగల్‌లో సన్నబియ్యం పంపిణీ.. BJP, కాంగ్రెస్ వార్

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బియ్యం మేమిస్తున్నామంటే మేమిస్తున్నామని ఓరుగల్లు BJP, కాంగ్రెస్ నాయకుల మధ్య వార్ నెలకొంది. కేంద్రం 5KGలు, రాష్ట్ర ప్రభుత్వం 1KG మాత్రమే ఇస్తుందని BJPనేతలు అంటుంటే.. మొత్తం రాష్ట్రప్రభుత్వమే భరిస్తోందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటో ఎందుకు పెట్టలేదని BJP నాయకులు ప్రశ్నిస్తున్నారు.
News April 5, 2025
వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పడిపోతున్న భూగర్భ జలాలు

వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. అక్టోబర్ తర్వాత వర్షాలు లేకపోవడం, యాసంగి పనులు మొదలు పెట్టడంతో నీటి వినియోగం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. HNK జిల్లాలో ఫిబ్రవరిలో 6.30 మీటర్ల లోతుకు నీరు పడిపోగా.. మార్చి చివరి నాటికి 7.16 మీటర్ల లోతుకు పడిపోయింది. WGL జిల్లాలో డిసెంబర్‌లో 4.18కు పడిపోగా.. మార్చి చివరి నాటికి 6.32 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.