News April 4, 2025

బాసరలో వరంగల్ విద్యార్థి మృతి

image

నిర్మల్ జిల్లా బాసర వేద భారతి విద్యాలయంలో కరెంట్ షాక్‌తో విద్యార్థి మృతిచెందాడు. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠగా గుర్తించారు. ఇక్కడ గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై విద్యార్థి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విద్యార్థి శుక్రవారం ఉదయం బోరు బటన్ వేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో మృతిచెందటం ఆందోళనకరం. ఘటనపై బాసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 18, 2025

RCB-PBKS మ్యాచ్ జరుగుతుందా? లేదా?

image

బెంగళూరు, పంజాబ్ మ్యాచ్ జరగాల్సిన చిన్నస్వామి స్టేడియంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని IPL అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే రాత్రి 10.54 గంటల వరకు మ్యాచ్ ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి. అప్పటిలోపు వర్షం ఆగితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ సాధ్యమవుతుందని అంపైర్లు తెలిపారు. అప్పటికీ వాన తగ్గకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి, చెరో పాయింట్ ఇవ్వనున్నారు.

News April 18, 2025

ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలకు కపిల్ సిబల్ కౌంటర్

image

రాష్ట్రపతికి గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు లేదన్న ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ <<16129153>>వ్యాఖ్యలపై<<>> రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా ఎంపీ కపిల్ సిబల్ ధన్‌ఖడ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘శాసన వ్యవస్థ విఫలమైనప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా కలగజేసుకుంటుంది. అది దాని హక్కు. న్యాయస్థానాలు స్వతంత్రంగా పనిచేయడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎప్పుడూ చూడలేదు’ అని అన్నారు.

News April 18, 2025

అవిశ్వాసం: విశాఖలో జనసేన నేతల సమావేశం

image

జీవీఎంసీ మేయర్‌పై శనివారం అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో విశాఖలోని ఓ హోటల్‌లో జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్పొరేటర్లు శుక్రవారం సమావేశం అయ్యారు. రేపు అవిశ్వాసంలో చేపట్టవలసిన తీరుపై ఎమ్మెల్యే వంశీకృష్ణ దిశానిద్దేశం చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అవిశ్వాసంలో వ్యవహరించాలన్నారు. మేయర్‌పై అవిశ్వాసంలో కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

error: Content is protected !!