News March 26, 2024

సత్తుపల్లి కౌన్సిలర్ చాంద్ పాషాకు కేటీఆర్ ఫోన్

image

సత్తుపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ చాంద్ పాషాపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. సంఘటనను తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం చాంద్ పాషాకు ఫోన్ చేసి పరామర్శించారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాడి చేసిన అధికార పార్టీ నేతలు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. 

Similar News

News March 15, 2026

BREAKING: ఖమ్మం: విద్యుత్ షాక్‌తో పంచాయతీ సెక్రటరీ మృతి

image

కరెంటు షాక్ తగిలి పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన విషాద ఘటన ఉదయం కారేపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ కారేపల్లిలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆయన స్వగ్రామంతో పాటు విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

News March 15, 2026

ఖమ్మం: యుద్ధ మేఘాలు.. వంట గదిలో మంట

image

అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు సామాన్యుడి వంట గదిపై పెనుభారం మోపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, దిగుమతులు తగ్గడంతో వంట నూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. నెల క్రితం రూ.155 ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 180కు, రూ. 110 ఉన్న పామాయిల్ రూ.135కు చేరింది. వేరుశనగ, కొబ్బరి నూనెల ధరలు కూడా భారీగా పెరగడంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 15, 2026

ఖమ్మం: పరీక్షల్లో నిర్లక్ష్యం.. సిబ్బందిపై వేటు

image

పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. DEO చైతన్య జైని కొణిజర్ల జడ్పీహెచ్‌ఎస్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. గేట్లు తెరిచి ఉంచడం, అపరిచితులను అనుమతించడం గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగించి వారి స్థానంలో ఇతరులను నియమించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.