News April 4, 2025
అనకాపల్లి: ‘సెలవులను పక్కాగా అమలు చేయాలి’

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అనకాపల్లి జిల్లాలో ఒంటి పూట సెలవులను పక్కాగా అమలు చేయాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పలు ప్రైవేట్ పాఠశాలలో 9,10వ తరగతి విద్యార్థులకు రెండు పూటలా క్లాసులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 18, 2025
RCB-PBKS మ్యాచ్ జరుగుతుందా? లేదా?

బెంగళూరు, పంజాబ్ మ్యాచ్ జరగాల్సిన చిన్నస్వామి స్టేడియంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని IPL అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే రాత్రి 10.54 గంటల వరకు మ్యాచ్ ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి. అప్పటిలోపు వర్షం ఆగితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ సాధ్యమవుతుందని అంపైర్లు తెలిపారు. అప్పటికీ వాన తగ్గకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి, చెరో పాయింట్ ఇవ్వనున్నారు.
News April 18, 2025
ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలకు కపిల్ సిబల్ కౌంటర్

రాష్ట్రపతికి గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు లేదన్న ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ <<16129153>>వ్యాఖ్యలపై<<>> రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా ఎంపీ కపిల్ సిబల్ ధన్‌ఖడ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘శాసన వ్యవస్థ విఫలమైనప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా కలగజేసుకుంటుంది. అది దాని హక్కు. న్యాయస్థానాలు స్వతంత్రంగా పనిచేయడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎప్పుడూ చూడలేదు’ అని అన్నారు.
News April 18, 2025
అవిశ్వాసం: విశాఖలో జనసేన నేతల సమావేశం

జీవీఎంసీ మేయర్‌పై శనివారం అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో విశాఖలోని ఓ హోటల్‌లో జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్పొరేటర్లు శుక్రవారం సమావేశం అయ్యారు. రేపు అవిశ్వాసంలో చేపట్టవలసిన తీరుపై ఎమ్మెల్యే వంశీకృష్ణ దిశానిద్దేశం చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అవిశ్వాసంలో వ్యవహరించాలన్నారు. మేయర్‌పై అవిశ్వాసంలో కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.