News April 4, 2025
బ్లడ్‌బాత్.. రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరి

అమెరికా సుంకాల వేళ భారత స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోవడంతో సుమారు రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ONGC, హిందాల్కో, సిప్లా షేర్లు అత్యధికంగా 6శాతం చొప్పున నష్టపోయాయి. టారిఫ్ దెబ్బకు ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ, మెటల్ రంగాల షేర్లు కుదేలయ్యాయి.
Similar News
News October 28, 2025
సకల శుభాలను ప్రసాదించే ఆదిపరాశక్తి శ్లోకం

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ ||
ఈ శ్లోకం సాక్షాత్తు ఆది పరాశక్తిని స్తుతిస్తుంది. ఈ శ్లోకాన్ని శ్రద్ధగా పఠిస్తే అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అమ్మవారు మనల్ని అన్ని విధాలా కాపాడుందని అంటున్నారు. చెడు ఆలోచనలు రాకుండా చేసి, భయాలను దూరం చేసి, శాంతి, అదృష్టం, క్షేమాన్ని ప్రసాదిస్తుంది అని పేర్కొంటున్నారు. <<-se>>#Shloka<<>>
News October 28, 2025
ట్రంప్‌కు MRI టెస్ట్… ఆరోగ్యంపై సందేహాలు

ఇటీవల తనకు MRI స్కానింగ్ జరిగినట్లు ట్రంప్ తెలిపారు. జ్ఞాపకశక్తి పరీక్ష చేయించుకున్నట్లు చెబుతూ అంతా బాగానే ఉందన్నారు. దీనిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన నాడీ, హృదయ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారేమోనని GW వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జోనాథన్ రైనర్ అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో ట్రంప్ చేతులపై మచ్చలు, నడకలో మార్పు, జ్ఞాపకశక్తి లోపంతో తడబాటు కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.
News October 28, 2025
రేపు, ఎల్లుండి పలు ఆర్జిత సేవలు రద్దు

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఎల్లుండి పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. దీనికి సంబంధించి రేపు రాత్రి 8-9 గంటల వరకు పుష్పయాగానికి అర్చకులు అంకురార్పణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఎల్లుండి తిరుప్పావడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఉండవని పేర్కొంది.


