News April 4, 2025

అధ్యక్ష పదవికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే నామినేషన్

image

విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిల్మ్ నగర్ క్లబ్ అధ్యక్ష పదవికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 38 నామినేషన్లు వేసినట్లు సమాచారం. కాగా.. అధ్యక్ష పదవికి విష్ణుకుమార్ రాజుతో పాటు సినీ నిర్మాత కేఎస్ రామారావు కూడా పోటీలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు పరశురామ రాజు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 18, 2025

అవిశ్వాసం: విశాఖలో జనసేన నేతల సమావేశం

image

జీవీఎంసీ మేయర్‌పై శనివారం అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో విశాఖలోని ఓ హోటల్‌లో జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్పొరేటర్లు శుక్రవారం సమావేశం అయ్యారు. రేపు అవిశ్వాసంలో చేపట్టవలసిన తీరుపై ఎమ్మెల్యే వంశీకృష్ణ దిశానిద్దేశం చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అవిశ్వాసంలో వ్యవహరించాలన్నారు. మేయర్‌పై అవిశ్వాసంలో కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

News April 18, 2025

విశాఖలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు

image

విశాఖ సిటీ పరిధిలో దొంగతనానికి గురైన 9బైక్‌లను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కోరాపుట్‌కి చెందిన అంతర్రాష్ట్ర దొంగలు కార్తీక్ కిల్లో, బాబుల సుపియాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు తెలిపారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాల్లో రాయల్ ఎన్ ఫీల్డ్, యమహా, తదితర వాహనాలు ఉన్నాయి.

News April 18, 2025

వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడింది: విశాఖ ఎంపీ

image

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ విమర్శించారు. శుక్రవారం విశాఖ జిల్లా టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విశాఖలో 33 ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారని, రుషికొండ ప్యాలెస్‌కు రూ.450కోట్లు YCPప్రభుత్వం ఖర్చుపెట్టిందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్టుకు రోడ్డు కనెక్టివిటీ, విశాఖలో TCSకు ప్రతిపాదనలు చేశామన్నారు.

error: Content is protected !!