News April 4, 2025

KMR: ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాలు, సహకార శాఖ అధికారులు, వ్యవసాయం, మార్కెటింగ్, గ్రామీణ అభివృద్ధి అధికారులతో కలెక్టర్ ఆశిష్ సాంగ్వ న్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 33 కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. మిగతా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News March 1, 2026

కృష్ణా: డిగ్రీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో జనవరి 2026లో నిర్వహించిన డిగ్రీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 12లోపు ఒక్కో పేపరుకు రూ.800 ఫీజు ఆన్‌లైన్‌లో http://www.onlinesbi.com/ వెబ్‌సైట్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం సూచించింది.

News March 1, 2026

KNR: ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

HYD బోయినపల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 2026-27 విద్యా సంవత్సరానికి 5 తరగతిలో ప్రవేశాలకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి దివాకర్ రావు తెలిపారు. దీంతో పాటు పలు తరగతులలో ఖాళీగా ఉన్న 21 సీట్లను సైతం భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 12 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 1, 2026

వేట్లపాలెం ప్రమాదంపై డిప్యూటీ సీఎం, హోంమంత్రి సమీక్ష

image

వేట్లపాలెం బాణసంచా పేలుడుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు మురళీ మోహన్, నిరంజన్ రెడ్డి వారిని కలిసి వివరాలను వివరించారు. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా లోపాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ నేత మాధవ్ కూడా పాల్గొన్న ఈ భేటీలో బాధితులకు అండగా ఉండాలని నిర్ణయించారు.