News April 4, 2025
MBNR: ముస్లిం మహిళల మేలు కోసమే వక్ఫ్ బోర్డు: ఎంపీ

భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైందని ఎంపీ డీకే అరుణ తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025కు లోక్ సభ, రాజ్యసభల్లో రాజముద్ర పడిందన్నారు. పేద ముస్లింలు, ముస్లిం మహిళల మేలు కోసం, వక్ఫ్ బోర్డులో పారదర్శకత కోసం ఈ సవరణ బిల్లు ఎంతో దోహదపడుతుందన్నారు. చారిత్రాత్మక నిర్ణయాలను అమలుపరుస్తూ దేశ సంక్షేమం కోసం బీజేపీ ముందుంటుందని అనడానికి ఈ బిల్లు ఆమోదమే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.
Similar News
News April 18, 2025
సంగారెడ్డి: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల కృషి: ఎస్పీ

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డిలోని ఎస్పీ జిల్లా కార్యాలయంలో కుల సంఘాల నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏమైనా అత్యవసరం అయితే 87126 56777 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవ రావు పాల్గొన్నారు.
News April 18, 2025
NZB: పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ

నగరంలోని పలు పోలీస్ స్టేషన్లను సీపీ సాయి చైతన్య శుక్రవారం తనిఖీ చేశారు. 3, 4, రూరల్ పోలీస్ స్టేషన్లను పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలు చేస్తున్నారు లేదా అని ఆరా తీశారు. వాహనాల పార్కింగ్ స్థలాన్ని చూశారు. గంజాయి, సైబర్ నేరాల నిర్మూలనకు కృషి చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
News April 18, 2025
విశాఖలో దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్.. పోలీసుల సూచనలు

విశాఖ పోర్ట్ స్టేడియంలో శనివారం నిర్వహించే దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్‌కు వచ్చే వారికి పోలీసులు శుక్రవారం పలు సూచనలు చేశారు. వీఐపీ టికెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రధాన గేటు ద్వారా ఎంట్రీ ఉంటుందన్నారు. వారి వాహనాలకు లోపల పార్కింగ్ చేసుకోవాలన్నారు. సాధారణ టికెట్లు ఉన్నవారికి పోర్ట్ స్టేడియం వెనుక గేటు నుంచి ప్రవేశం ఉంటుందన్నారు. వారి వాహనాలు నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలన్నారు.