News April 4, 2025
పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా అశోక్ కుమార్

పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎన్. అశోక్ కుమార్ నియమితులయ్యారు. కొద్ది రోజుల క్రితం సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ రంగారావు బదిలీపై గుంటూరు వెళ్లడంతో ఆయన స్థానంలో ప్రభుత్వం సురేశ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
Similar News
News April 18, 2025
తార్నాక టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ సేవలు

తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో గుండె సంబంధిత చికిత్సలకు క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమర్జెన్సీ కేర్ యూనిట్ ప్రారంభమైంది. ఈ సేవలను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ శుక్రవారం ప్రారంభించారు. ఫ్యాక్ట్స్ ఫౌండేషన్, అశోక్ లేలాండ్, నిర్మాన్ డాట్ ఓఆర్‌జీ సంస్థల సాయంతో ఈ విభాగాలు ఏర్పాటు అయ్యాయి. క్యాథ్ ల్యాబ్‌తో ఉద్యోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
News April 18, 2025
4 రోజుల వేట.. 800 CCTVల స్కాన్.. నిందితుడి అరెస్ట్

ఢిల్లీలోని ఆస్పత్రిలో ICUలో చికిత్స పొందుతున్న <<16113128>>ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారానికి<<>> పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8 బృందాలు 4 రోజులపాటు వేట సాగించి, 800 సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి అతడిని పట్టుకున్నారు. నిందితుడి పేరు దీపక్ అని, బిహార్ ముజఫర్‌నగర్ వాసి అని పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో 5 నెలలుగా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు.
News April 18, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ జిల్లా వ్యాప్తంగా వక్ఫ్ బిల్లు సవరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు ☞ నరసరావుపేట: మంచినీటి కుళాయిల నుంచి రంగు మారిన నీరు ☞ రాజుపాలెం: ఎన్టీఆర్, కోడెల విగ్రహాల ఆవిష్కరించిన ఎంపీ, ఎమ్మెల్యేలు ☞గురజాల: తిరుమలలో గోరక్షణకు దేవుడే దిగిరావాలి: కాసు మహేష్ ☞ దాచేపల్లి: సోషల్ యాక్టివిస్ట్‌కు రిమాండ్ విధించిన న్యాయమూర్తి