News April 4, 2025
విశాఖలో కొత్త చట్టం.. తొలిరోజు ఇద్దరికి జరిమానా

విశాఖలో కాట్పా 2003 చట్టం నేటి నుంచి అమలు చేశామని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. జిల్లాలో ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం పలు చోట్ల ప్రజలకు అవగాహనా కల్పించారు. బహిరంగ ప్రదేశాలలో పొగ తాగితే రూ.200 జరిమానా విధిస్తామన్నారు. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తులకు 200 చొప్పున జరిమానా విధించారు. స్కూల్స్ వద్ద 100 మీటర్లలోపు పొగాకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని NCD ప్రోగ్రాం ఆఫీసర్ హారిక హెచ్చరించారు.
Similar News
News September 13, 2025
విశాఖ: NMMS పరీక్షకు దరఖాస్తు చేశారా?

2025-26 విద్యాసంవత్సరానికి గాను నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ కుమార్ తెలిపారు. రూ.3.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న 8వ తరగతి విద్యార్థులు అర్హులు. సెప్టెంబర్ 30వ తేదీలోగా www.bse.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష డిసెంబర్ 7న జరుగుతుంది.
News September 13, 2025
భీమిలి: బాలికపై అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు

భీమిలి ప్రాంతంలో 8 నెలల క్రితం వికలాంగురాలైన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి పోక్సోచట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. భీమిలి ప్రాంతంలో అమ్మమ్మ దగ్గర ఉన్న మైనర్‌ను బోరా ఎల్లారావు అత్యాచారం చేశాడు. బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా కోర్టులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు.
News September 13, 2025
ఈపీడీసీఎల్ CMD పృథ్వితేజ్‌కి ఏపీ ట్రాన్స్‌కోలో అదనపు బాధ్యతలు

విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ ఈపీడీసీఎల్ CMD పృథ్వితేజ్‌ని ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ఆర్&అడ్మిన్)గా పూర్తి అదనపు బాధ్యతలపై ప్రభుత్వం నియమించింది. ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ సభ్య కార్యదర్శిగా ఏపీ ట్రాన్స్‌కో (విజిలెన్స్ & సెక్యురిటీ) బాధ్యతలు కూడా అప్పగించింది. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న కీర్తి చేకూరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.