News April 4, 2025

నాగర్‌కర్నూల్: 1 నుంచి 9వ తరగతుల పరీక్షల షెడ్యూలు విడుదల

image

నాగర్ కర్నూల్ జిల్లా విద్యా శాఖ అధికారులు ఒకటి నుంచి తొమ్మిదో తరగతుల సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల టైం టేబుల్ షెడ్యూల్‌ను ఈరోజు విడుదల చేశారు. ఈనెల 9 నుంచి 16 తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. 

Similar News

News December 30, 2025

టీడీపీ జిల్లా అధ్యక్షుడిని కలిసిన గోనుగుంట్ల

image

పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన షేక్ జానీ సైదాను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, పల్నాడు జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన వివిధ అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.

News December 30, 2025

భారత్ విజయం.. సిరీస్ క్లీన్‌స్వీస్

image

శ్రీలంక ఉమెన్స్‌ టీమ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌ను భారత అమ్మాయిలు వైట్‌వాష్ చేశారు. తాజాగా చివరి టీ20లోనూ అదరగొట్టి 15 రన్స్ తేడాతో విజయం సాధించారు. 176 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక 160/7 పరుగులకే పరిమితమైంది. భారత జట్టులో దీప్తి, అరుంధతి, స్నేహ్ రాణా, వైష్ణవి, శ్రీచరణి, అమన్‌జోత్ తలో వికెట్ తీశారు.

News December 30, 2025

BIG BREAKING: ఆదిలాబాద్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

image

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీల కమిషనర్‌తో ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు VC నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ రిజర్వేషన్ల గెజిట్ వెలువడగానే అధికారిక నోటిఫికేషన్ రానుంది.
SHARE IT