News April 4, 2025

BIG NEWS: రేపటి మ్యాచ్‌కు CSK కెప్టెన్‌గా ధోనీ?

image

గత నెల 30న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గాయపడిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా కోలుకోలేదని సమాచారం. రేపు ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ధోనీ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Similar News

News September 12, 2025

YCP వల్లే వైద్య కళాశాలల్లో ఈ దుస్థితి: అనిత

image

AP: PPP వల్ల ఏ ఒక్క సీటూ పేదలకు దక్కకుండా పోదని హోంమంత్రి అనిత భరోసానిచ్చారు. ‘గత ఐదేళ్లు YCP చేసిన పాపాల వల్లే వైద్య కళాశాలల్లో ఒక్క అడ్మిషనూ ఇవ్వలేకపోయాం. మెడికల్ కాలేజీల భవనాల్లో 47 శాతం మాత్రమే పనులు జరిగాయి. ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ లేదని అడ్మిషన్ ఇవ్వలేమని నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్ ఇచ్చింది. మెడికల్ కాలేజీలకు ఇవ్వాల్సిన సొమ్మును వేరే వాటికి ఉపయోగించుకున్నారు’ అని తెలిపారు.

News September 12, 2025

కులం మీకు కూడు పెట్టదు: MP భరత్

image

AP: కులం, మతం, వర్ణం ఏదైనా కావొచ్చు.. వివక్ష కొనసాగుతూనే ఉండే ప్రమాదముందని Way2News కాన్‌క్లేవ్‌లో MP భరత్ పేర్కొన్నారు. ‘నేను కుల రాజకీయాలకు వ్యతిరేకం కాదు. కానీ, నేను వాటిని పాటించను. నేను ఆ అజెండాకు బానిసను కాదు. కులం మీకు కూడు పెట్టదు అనేదే నమ్ముతాను. రాజకీయాల్లో కోరుకున్నది దక్కకపోతే దానిని కులానికి ఎలా ఆపాదించాలి, ఎలా బ్లాక్‌మెయిల్ చేయాలని చూసే వాళ్లు కూడా కొందరు ఉన్నారు’ అని తెలిపారు.

News September 12, 2025

రాజకీయాల్లో యువతకు అవకాశం: MP భరత్

image

యువత రాజకీయాల్లోకి రావాలని Way2News కాన్‌క్లేవ్‌లో MP భరత్ పిలుపునిచ్చారు. ‘7 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయి. మా పార్లమెంట్ నియోజకవర్గంలోనే 10 వార్డుల్లో క్వాలిటీ లీడర్‌షిప్ లేదని నా అభిప్రాయం. ఆ స్థానాల్లో యువకులకు ఓపెన్ కాల్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. కార్పొరేటర్ ఎలక్షన్స్‌కి ఐదారుగురు యువకులను రాజకీయాల్లోకి తీసుకురాగలిగితే వాళ్లే భవిష్యత్‌లో MLA క్యాండిడేట్స్ అవుతారు’ అని తెలిపారు.