News April 4, 2025

పవన్ కళ్యాణ్ మాటకు నిలబడి ఉంటాం: GVMC జనసేన కార్పొరేటర్లు

image

విశాఖ జనసేన పార్టీ ఆఫీసులో జీవీఎంసీ జనసేన కార్పొరేటర్లు శుక్రవారం సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మాటకు నిలబడి ఉంటామని జనసేన కార్పొరేటర్లు అన్నారు. ‘అవిశ్వాసంలో పవన్ కళ్యాణ్ ఏది చెబితే అదే మా తుది నిర్ణయం’ అని అన్నారు. జీవీఎంసీ కౌన్సిల్ అవిశ్వాసంపై ఒకే తాటిపై ఉంటామని భీశెట్టి వసంతలక్ష్మి అన్నారు. త్వరలో కార్పొరేటర్లతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నట్లు PAC సభ్యులు తాతారావు వెలెల్లడించారు.

Similar News

News April 5, 2025

విశాఖ తీరంలో అమెరికా యుద్ధ విన్యాసాలు

image

విశాఖ తీరానికి సైనికులతో ఉన్న అమెరికా దేశ యుద్ధ నౌకలు వచ్చాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం భద్రతకు దిక్సూచిగా భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్ 2025 విన్యాసాల్లో పాల్గొనడానికి విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఈ నెల ఏడో తేదీ వరకు హార్బర్ ఫేజ్‌లో విన్యాసాలు జరుగుతాయి. అమెరికా యుద్ధనౌక యూఎస్ కంస్టాక్, రాల్స్ జాన్సన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

News April 5, 2025

అప్పన్న స్వామి దర్శన వేళలో మార్పులు ఇవే..

image

ఈ నెల 8వతేదీ సింహద్రి అప్పన్న స్వామి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం నేపథ్యంలో ఈనెల 7 నుంచి 24వరకు దర్శన వేళ్లలో మార్పులు చేశారు. ఈ రోజుల్లో అర్జీత సేవలు ఉండవని అర్చకులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. 7వ తేదీ నుంచి 14 వరకు సుప్రభాత సేవ, ఉదయం, రాత్రి ఆరాధన సేవల్లో భాగస్వామ్యం ఉండదన్నారు. అలాగే రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు దర్శనాలు ఉండవు. 10వ తేదీన ఉదయం 8గంటల తర్వాత సర్వ దర్శనాలు ప్రారంభం కానున్నాయి.

News April 5, 2025

విశాఖ నుంచి బయలుదేరే రైళ్లకు గమ్యం కుదింపు

image

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లకు బచేలి కిరండోల్ సెక్షన్‌లో ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం గమ్యం కుదించినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. విశాఖ – కిరండోల్ పాసెంజర్(58501/02),విశాఖ-కిరండోల్ నైట్ ఎక్స్ ప్రెస్(18515/16) ఏప్రిల్ 5 నుంచి 14వరకు దంతేవాడ వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో కిరండోల్‌కు బదులుగా దంతేవాడ నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

error: Content is protected !!