News April 4, 2025

రీ-వెరిఫికేషన్ సద్వినియోగం చేసుకోండి: భార్గవ్ తేజ

image

కలెక్టరేట్‌లో శుక్రువారం జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సమావేశంలో పాల్గొని వికలాంగుల సంక్షేమం, ట్రాన్స్ జండర్స్, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సదరన్ సర్టిఫికెట్లు జీజీహెచ్‌లో రీ-వెరిఫికేషన్ జరుగుతుందని, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పారు. వికలాంగుల హక్కుల చట్టం 2016, వికలాంగుల సర్టిఫికెట్ల పంపిణీపై సమీక్షించారు. 

Similar News

News July 8, 2025

గుంటూరు జిల్లాలో ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్

image

మత్తుపదార్థాల రహిత విద్యా వాతావరణం కోసం గుంటూరు జిల్లాలో “ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్” స్పెషల్ డ్రైవ్ మంగళవారం ప్రారంభమైంది. ఎస్పీ సతీశ్ కుమార్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల సమీపంలో ఉన్న షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాల విక్రయంపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. సిగరెట్లు, గంజాయి విక్రయాలపై నిఘా కొనసాగుతుందని తెలిపారు.

News July 8, 2025

GNT: ‘మాజీ ఎంపీ అనుచరుడి నుంచి ప్రాణరక్షణ కల్పించండి’

image

లాలాపేటకు చెందిన ముజబుర్ రహమాన్, తన సోదరుడికి ప్రాణరక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుడు సన్నీ, ఇసుక క్వారీ నిర్వహణకు రూ.25 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బీహార్ గ్యాంగ్‌తో చంపిస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై తన సోదరుడు గతంలో ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు.

News July 8, 2025

గుంటూరులో కూరగాయల ధరలు రెట్టింపు

image

గుంటూరు మార్కెట్లలో టమాటా, పచ్చిమిరప, వంకాయ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. పచ్చిమిరప కిలో రూ.80కి చేరగా, టమాటా రూ.40, వంకాయ రూ.60 పలుకుతోంది. ములక్కాయ ఒక్కటి రూ.15 నుంచి రూ.20కి పెరగడం వినియోగదారులను కుదిపేస్తోంది. డిమాండ్‌తో పోల్చితే సరఫరా తక్కువగా ఉండటం వల్లే ఈ ధరల పెరుగుదల అని వ్యాపారులు తెలిపారు. రైతుబజార్లలో కూడా ఇదే స్థితి కొనసాగుతోంది.