News April 4, 2025
కాకినాడ జిల్లాలో పిడుగుపాటు హెచ్చరికలు జారీ

వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కాకినాడ జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. శుక్రవారం ఈ మేరకు ప్రజల ఫోన్లకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, పెదపూడి తదితర ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ సందేశంలో పేర్కొంది.
Similar News
News April 19, 2025
ఎల్కతుర్తి సభ చరిత్రలో నిలిచిపోతుంది: ఎమ్మెల్యే పల్లా

ఈ నెల 27న ఎల్కతుర్తి సమీపంలో నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సభా వేదికను నేతలతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. బీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిందని, కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News April 19, 2025
సిద్దిపేట కూతురు నిశ్చితార్థం.. ఉరేసుకుని తండ్రి ఆత్మహత్య

కూతురు నిశ్చితార్థం రోజు తండ్రి సూసైడ్ చేసుకున్న విషాదకర ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మండలం తునికి కాల్సా గ్రామానికి చెందిన కొడగల్లా అంజయ్య(57)కు ఇద్దరు కూతుళ్లు. అప్పుచేసి పెద్దకూతురు వివాహం చేయగా చిన్న కుమార్తె పెళ్లి కుదిరింది. శుక్రవారం జరగాల్సిన నిశ్చితార్థానికి అప్పు పుట్టకపోవడంతో మానసిక క్షోభకు గురై గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.
News April 19, 2025
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: మంత్రి రాజనర్సింహ

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాయికోడ్ డివిజన్ ఆత్మ కమిటీ ఛైర్మన్‌గా కుమార్ రావు ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.