News April 5, 2025
వరంగల్ CGHSకు సిబ్బందిని నియమించండి: MP కావ్య

కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి రోలి సింగ్‌ను ఢిల్లీలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ CGHS వెల్‌నెస్ సెంటర్ ప్రారంభం కోసం వైద్య సిబ్బంది నియామకాన్ని వేగవంతం చేయాలని వినతి పత్రం అందించారు. సుమారు 12 వేల మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు చికిత్స కోసం దూర ప్రయాణం చేయాల్సి వస్తోందని తెలిపారు. దీనిపై సానుకూల స్పందించినట్లు తెలిపారు.
Similar News
News September 14, 2025
రేవంత్ సర్కార్‌ను జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి: మంత్రి

పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా HYDలో మౌలిక సదుపాయాలు కల్పన దిశగా సీఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్ పరిధిలో ఆత్మీయ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వనగరం అజెండాగా అభివృద్ధి చేయాలనే పట్టుదలతో సీఎం పనిచేస్తున్నారన్నారు. ఆయనను, ప్రజా ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు.
News September 14, 2025
SP దామోదర్‌కు వీడ్కోలు

ప్రకాశం జిల్లా SP దామోదర్ ఐపీఎస్ విజయనగరానికి బదిలీ అయ్యారు. ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 నెలల పాటు SPగా విశేష కృషి చేశారని పోలీస్ అధికారులు కొనియాడారు. ప్రత్యేక వాహనంలో వెళ్లిన దామోదర్‌కు పోలీసులు గౌరవ సెల్యూట్ చేశారు. పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
News September 14, 2025
YCP అవినీతిపాలనకు బాబు, మోదీ చరమగీతం: నడ్డా

AP: వైసీపీ హయాంలో ఏపీలో అవినీతి రాజ్యమేలిందని BJP జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. YCP అవినీతిపాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారన్నారు. విశాఖలో ‘సారథ్యం’ సభలో ఆయన మాట్లాడారు. ‘2014కు ముందు దేశంలో ప్రజలను మభ్యపెట్టే మేనిఫెస్టోలు తీసుకువచ్చి అధికారంలోకి వచ్చేవారు. దేశంలో అసమర్థ, వారసత్వ రాజకీయాలు ఉండేవి. 2014 తర్వాతే దేశంలో మార్పులు వచ్చాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.