News April 5, 2025

నేడు విజయవాడలో “ఆర్ట్ ఫన్ డే” కార్యశాల

image

విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(SPA)లో శనివారం “ఆర్ట్ ఫన్ డే” పేరుతో కార్యశాల జరగనుంది. ఉదయం 10 నుంచి 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చిత్రకళలో నైపుణ్యం ఉన్నవారిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామని, SPA సంస్థ, ఏపీ అటవీ శాఖ తదితరుల సౌజన్యంతో ఈ కార్యశాల జరుపుతున్నామన్నారు. 

Similar News

News January 4, 2026

రేవంత్‌ నాలుక కోయాలి: హరీశ్ రావు

image

తెలంగాణ ఏర్పడ్డాక 42 రోజుల్లోనే కృష్ణాలో 69% నీళ్ల కోసం కేంద్రానికి KCR లేఖ రాశారని హరీశ్ రావు తెలిపారు. ‘కాంగ్రెస్‌, TDP ద్రోహం వల్లే కృష్ణాలో 299 TMCలు వచ్చాయి. కానీ గోదావరిలో 933 TMCలకు మేం అనుమతులు సాధించాం. సభలో అబద్ధాలు చెప్పిన సీఎం రాజీనామా చేయాలి. అబద్ధాలు చెప్పినందుకు రేవంత్‌ నాలుక కోయాలి. ఇలా మాట్లాడుతున్నందుకు నాపై దాడి చేయించవచ్చు. అవసరమైతే హత్యాయత్నం చేయించవచ్చు’ అని కామెంట్ చేశారు.

News January 4, 2026

VKB: 630 కుక్కలకు స్టెరిలైజేషన్: ఏసుదాస్

image

పట్టణంలో 630 వీధి కుక్కలను పట్టి వాటికి స్టెరిలైజేషన్ చేసి ఆహారం అందిస్తున్నామని వికారాబాద్ మునిసిపల్ ఇన్‌ఛార్జి శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ఏసుదాస్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని జనన నియంత్రణ కేంద్రంలో ఆపరేషన్లు చేసిన కుక్కలకు ఆహారం అందించారు. కుక్కలను నియంత్రించేలా వాటి సంఖ్యను పెరగకుండా ఆపరేషన్లు చేసి వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించి వదిలిపెడతామని తెలిపారు.

News January 4, 2026

గన్నవరం చేరకున్న అశోక గజపతి రాజు

image

గోవా గవర్నర్ అశోక గజపతి రాజు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఆయనకు విమానాశ్రయ లాంజ్‌లో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం లభించింది. గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం, ఇతర జిల్లా అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించారు. విమానాశ్రయం వెలుపల పోలీసు భద్రత మధ్య ఆయన కొద్దిసేపు అధికారులతో ముచ్చటించారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు బయలుదేరి వెళ్లారు.